వేతనాలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ర్యాలీ

వేతనాలు చెల్లించాలంటూ ఆశా వర్కర్ల ర్యాలీ

HNK: హనుమకొండలో ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నుంచి కలెక్టరేట్ వరకు ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ హాజరై మాట్లాడుతూ... ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలన్నారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.