కంగ్టిలో ఘనంగా రామాలయం 51వ వార్షికోత్సవాలు
SRD: కంగ్టిలోని శ్రీరామాలయంలో 51వ వార్షికోత్సవ వేడుకలు నేడు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జుక్కల్ (సమర్థ రాందాస్ ) రామ మందిరం పీఠాధిపతి గోపాల్ మహారాజ్ శాస్త్రి, కేశవ మహారాజ్ ఆధ్వర్యంలో వైదిక సంప్రదాయ పద్ధతిలో మహా యజ్ఞం క్రతువు, విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో యజ్ఞం పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.