ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం షేక్ పల్లి గ్రామంలో రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అందుతుందని వెల్లడించారు. సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నట్టయితే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.