ఏప్రిల్ తర్వాత 180 డాలర్లకు చమురు ధరలు: సౌదీ
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో వందల సంఖ్యలో చమురు నౌకలు జలసంధి వద్ద ఉండిపోయాయి. ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర అమాంతం పెరిగి 119 డాలర్లకు చేరుకుంది. జలసంధిలో నౌకల రాకపోకలు ఇలాగే నిలిచిపోతే చమురు ధరలు ఏప్రిల్ నాటికి 150 డాలర్లకు.. ఆ తర్వాత 180 డాలర్ల వరకు పెరగొచ్చని సౌదీ అరేబియా అంచనా వేసింది.