యోగా నేర్చుకోవాలని ఉందా..? ఇది మీ కోసమే..!

HYD: రవీంద్ర భారతిలో మే 12 నుంచి జూన్ 3 వరకు 21 రోజుల పాటు ఉచిత వేసవి యోగా వర్క్ షాప్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను భాషా, సంస్కృతి శాఖ సంచాలకుడు గురువారం మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ భవాని నీరటి నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు 9493654626, info.yogabhyas@gmail.com ద్వారా సంప్రదించవచ్చన్నారు.