త్రాగునీరు సమస్య ఫిర్యాదు కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్
KMM: ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఈఈ పుష్పలత తెలిపారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.