ఆ వివాదంలో నేను జోక్యం చేసుకోలేదు: ఎంపీ

ఆ వివాదంలో నేను జోక్యం చేసుకోలేదు: ఎంపీ

తమిళనాడు బోట్ల వివాదంలో తాను జోక్యం చేసుకోలేదని రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు వెల్లడించారు. ఆ అంశంపై అధికారుల గ్రామస్తులతో తాను చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. దుష్ప్రచారం వెనుక ఉన్నవారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిజానిజాలను బయటపెట్టాలన్నారు. కాగా, ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో మత్స్యకారుల మధ్య బోట్ల వేట విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతుంటాయి.