స్టేడియం మైధానంలో నెట్ బాల్ పోటీలు
MBNR: జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నేటి నుంచి నెట్ బాల్ పోటీలు ప్రారంభం కానున్నాయి. గురువారం రాత్రి నాటికే తెలంగాణలోని 26 జిల్లాలకు చెందిన క్రీడాకారులు స్టేడియం మైదానానికి చేరుకున్నారు. ఈనెల 12వ తేదీ వరకు పోటీలు కొనసాగనున్నాయి. క్రీడాకారులకు అంబేద్కర్ కళాభవనం, స్కాట్స్&గైడ్స్ భవనం, చైతన్య, లిటిల్ స్కాలర్స్ పాఠశాలల్లో వసతి కల్పించారు.