EPFO వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం
EPFOపై ఏడాదికి ఇచ్చే వడ్డీరేట్లపై సెంట్రల్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేట్లను 8.25 శాతంగానే ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా వడ్డీ రేటు ఇదే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.