వీడిన బాలిక అదృశ్య మిస్టరీ ..

KNL: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో బాలిక అదృశ్యంపై మిస్టరీ మంగళవారం రాత్రి వీడింది. పోలీస్ జాగిలాలతో పరిశీలించే క్రమంలో ముగ్గురు బాలురపై పోలీసులకు అనుమానం వచ్చి విచారించడంతో నిందితులు చేసిన ఘాతుకం ఒప్పుకున్నట్టు సమాచారం. ముగ్గురు మైనర్ బాలురు పోలీసుల అదుపులో ఉన్నారు. బాలికపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు బాలురు ఒప్పుకున్నట్లు సమాచారం.