హోమియో వైద్యశాలకు మోక్షమెప్పుడో..?
SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలోని ప్రభుత్వ హోమియో వైద్యశాల సంవత్సర కాలంగా తెరవడం లేదని స్థానికులు తెలిపారు. గత సంత్సర కాలంగా డాక్టర్స్ లేక హోమియో ఆస్పత్రి పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రభుత్వ హోమియో వైద్యశాలను తెరిపించి, రోగులకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.