మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

కోనసీమ: మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అన్నారు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామంలో మహిళలకు కుట్టుమిషన్ ట్రైనింగ్ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు పంపిణీ చేసేందుకు కార్యచరణ చేపట్టిందన్నారు.