గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై

గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్సై

నెల్లూరు: బోగోలు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల కోసం ప్రతి ఒకరూ నిబంధనలు పాటించాలని బిట్రగుంట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. గణేష్ మండపాన్ని బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేయాలంటే పోలీస్ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ఆన్‌లైన్‌లో ganeshutsav.in లో నమోదు చేసుకోవాలని సూచించారు.