23 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

23 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని CM చంద్రబాబు భరోసా కల్పించారు. ఎన్నికల్లో చెప్పనవి కూడా అమలు చేస్తున్నామన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని, దారిలో పెడుతున్నామన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని, జీవనాధారం, భద్రత, గౌరవం అని తెలిపారు.