వరంగల్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు: ఎంపీ
వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు మంజూరు అయ్యింది. ఎంపీ డా. కడియం కావ్య నిరంతర కృషి ఫలితంగా ఆకాశవాణి క్వార్టర్స్‌లో సెంటర్ ఏర్పాటు చేయబడింది. సెంటర్ ద్వారా వైద్య, ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని శుక్రవారం తెలిపారు.సెంటర్‌ను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.