జపాన్‌లో 40 ఏళ్ల తర్వాత కొత్త పక్షి

జపాన్‌లో 40 ఏళ్ల తర్వాత కొత్త పక్షి

జపాన్‌లోని టోకారా దీవుల్లో 'టోకారా లీఫ్ వార్‌బ్లర్' అనే కొత్త పక్షి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. 1982 తర్వాత ఆ దేశంలో కనుగొన్న తొలి, కొత్త పక్షి జాతి ఇదే కావడం విశేషం. 10-12CM పొడవు, 16-18CM రెక్కల వెడల్పుతో కేవలం 9 గ్రాముల బరువు ఉండే ఈ చిన్ని పక్షి.. చూడటానికి 'ఇజిమాస్ వార్‌బ్లర్'ను పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.