VIDEO: మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
JGL: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో మల్లన్న స్వామి జాతర ఘనంగా కొనసాగుతోంది. ఆదివారం సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.