వంతెన పైనుంచి పడి కార్మికుడు మృతి

SRD: తాండూరు మండలం నారాయణ్‌పూర్‌లో బుధవారం జరిగిన సంఘటనలో కొండాపూర్‌కు చెందిన రైల్వే కార్మికులైన సురేష్ (25), అంజి వంతెనకు రంగులు వేస్తుండగా, వారు ఎక్కిన నిచ్చెన విరిగిపోవడంతో కిందపడిపోయారు. ఈ దుర్ఘటనలో సురేష్ కాగ్నా నదిలో పడి మృతి చెందగా, అంజికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.