చేప పిల్లలను పంపిణీ చేసిన కలెక్టర్
MNCL: మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం గుల్లకోట ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్యతో కలిసి చేప పిల్లలను పంపిణీ చేశారు.