పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్

SRD: నార్సింగి మండలంలోని నర్సంపల్లిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం ఆధారంగా పోలీసులు ఆదివారం దాడి చేశారు. గ్రామ శివారులోని మహ్మద్ అజాం పొలం వద్ద పేకాట ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.30,120 నగదు, పది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అహ్మద్ మోహినోద్దీన్ తెలిపారు.