ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

KNR: చిగురుమామిడి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. చొప్పిదండి అభిలాష్ (23) బుధవారం తన పొలం వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించే సరికి అప్పటికే అభిలాష్ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.