ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని గోపాల్ చెరువులో మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100 శాతం రాయితీపై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెడ్మ భొజ్జు పటేల్ ఇవాళ ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.