మంత్రి ఫరూఖ్‌కు వక్ఫ్ ఛైర్మన్ కీలక విజ్ఞప్తి
KRNL: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు చేయాలని శుక్రవారం ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. ఈ మేరకు మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్‌కు లేఖ రాశారు. మసీదులలో తాగునీరు, పారిశుద్ధ్యం, శుభ్రత, భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఎటువంటి లోపం లేకుండా అధికారులు పని చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.