అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

VZM: బొబ్బిలి మండలం పారాది గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, సౌకర్యాల నిర్వహణపై ఆరా తీశారు. ఈరోజు మెనూలో టొమోటో పప్పు ఉండగా అది లేకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి వర్కర్‌ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.