విష జ్వరంతో ఆరేళ్ల చిన్నారి మృతి

విష జ్వరంతో ఆరేళ్ల చిన్నారి మృతి

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం ఆనంద పాలెంకు చెందిన ఆరేళ్ల చిన్నారి అరుణ్ విష జ్వరంతో ఆస్పత్రిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆరేళ్ల చిన్నారి విష జ్వరంతో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు గ్రామంలో విష జ్వరాలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.