వైరల్ అవుతున్న దొంగ రాసిన లేఖ
తమిళనాడులో జేమ్స్ పాల్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. అయితే, దొంగ రాసిన లేఖ ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. కుటుంబంతో మదురైకి వెళ్లిన జేమ్స్.. తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఇంట్లో తనిఖీ చేస్తుండగా దొంగ రాసిన లెటర్ కనిపించింది. 'ఇంట్లో ఒక్క రూపాయి లేదు. ఎందుకు ఇన్ని కెమెరాలు? కొంచెం అయినా క్యాష్ పెట్టండి' అని లేఖలో రాసుంది.