బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సూచన
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.