రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

KMRD: నాగిరెడ్డిపేట మండలంలోని బంజారా గ్రామ శివారులో బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఒంటరి శ్రీనివాస్ రెడ్డి బైక్‌పై గోపాల్‌పేట్ నుంచి మాసాన్‌పల్లి వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్‌పై జానకంపల్లి గ్రామానికి చెందిన రాములు, సమత వస్తుండగా ఢీకొన్నాయి.