పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ

అన్నమయ్య: రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో బుధవారం మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు, రికార్డులు,కేసు డైరీలు, ఆయుధాల భద్రతను సమీక్షించారు. సిబ్బందిని క్రమశిక్షణగా పనిచేయమని, ప్రజల ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించమని స్పష్టంగా సూచించారు. అనంతరం మండల పరిధిలోని నీటి ప్రవాహం ఉన్న కొత్త చెరువును పరిశీలించారు.