VIDEO: పవన్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
CTR: ఈ నెల 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెంగరగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలంలో మార్కింగ్ చేసి జేసీబీలతో చదును చేస్తున్నారు. పవన్ కాన్వాయ్ వెళ్లే మార్గంలో సైతం శుభ్రపరుస్తున్నారు. అయితే కుంకి ఏనుగుల క్యాంపులో పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్న నేపథ్యంలో శిలాఫలకం ఏర్పాట్లు చేస్తున్నారు.