VIDEO: రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ఓ మహిళకు గాయాలు
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, మరో ప్రైవేటు బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రైవేటు బస్సు అద్దం పగిలిపోవడంతో బస్సులో ఉన్న ఓ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనతో రహదారిపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.