'ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలి'

ASF: ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో పూర్తి చేయాలని బెజ్జూర్ ఎంపీడీవో బండారి ప్రవీణ్ కుమార్ సూచించారు. శనివారం మండలంలోని రెబ్బెన గ్రామంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకం ప్రవేశపెట్టిందని, లబ్ధిదారులు ఈ నెల 31లోగా బేస్మెంట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అవి పూర్తయిన వెంటనే ప్రతి లబ్ధిదారునికి లక్ష రూపాయలు బిల్లు అందజేస్తామని తెలిపారు.