గంగమ్మ తల్లికి పూజలు చేసిన ఎమ్మెల్యే

BHNG: యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ చెరువు మత్తడి వద్ద, కట్టమైసమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మకు సారే, చీర, పసుపు, కుంకమలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. వర్షాలకు నీరు చెరువులోకి చేరి అలుగు పారుతుండడంతో గంగమ్మకు పూజలు చేశారు.