'ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి'
BHNG: రామన్నపేట మండల సీపీఐ కార్యాలయంలో ఇవాళ రైతు సంఘం మండల మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకుని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని డిమాండ్ చేశారు.