నేడు నీటి సరఫరాలో అంతరాయం
ATP: నగరంలో గురువారం నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. జశ్వంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఏబీఆర్ నుంచి నగరానికి నీరు సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ జల్లిపల్లి, జల్లిపల్లి టోల్ గేట్, అరవకూరు, సిండికేట్ నగర్ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. నేడు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు.