వరద కాలువలను తనిఖీ చేసిన హైడ్రా కమిషనర్

HYD: అమీర్ పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలకు ఉన్న ఆటంకాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. అనంతరం కృష్ణాకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైనుంచి భారీ ఎత్తున వస్తున్న వరదను కృష్ణాకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలా వరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.