VIDEO: భూ తగాదా.. దారుణ హత్య
ASR: జీ.మాడుగుల మండలం బొబ్బంపాడులో భూ తగాదాల నేపథ్యంలో ఆదివారం హత్య జరిగింది. సత్తిబాబు, రాం ప్రసాద్ కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ తగాదాలు ఉన్నాయి. ఆదివారం మళ్లీ గొడవ జరగడంతో రాం ప్రసాద్ కర్రతో సత్తిబాబు, అతడి భార్య నీలమ్మపై దాడి చేశాడు. ఈ ఘటనలో సత్తిబాబు మృతి చెందగా నీలమ్మ తీవ్రంగా గాయపడింది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని ఎస్సై షణ్ముఖరావు తెలిపారు.