రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: శావల్యాపురం మండలం కొత్తలూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో గడపగడపకు వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.