ప్రజా పద్దుల సమావేశంలో ఎమ్మిగనూరు MLA
KRNL: ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి 2 రోజుల పాటు జరగనున్న ప్రజాపద్దుల కమిటీ సమావేశంలో ఎమ్మిగనూరు MLA, పీఏసీPAC సభ్యులు జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల మీద సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటి వివరాలు, ఖర్చులు పరిశీలించి ముఖ్యమైన వాటిని ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేయాలని చర్చించారు