అరటి రైతు సమస్యలపై కలెక్టర్‌కు వినతి
ATP: జిల్లాలోని అరటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ YCP నాయకులు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిశారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, తలారి రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దళారుల మోసాల నుంచి రైతులకు రక్షణ కల్పించి, గిట్టుబాటు ధర నిర్ణయించాలని వారు కోరారు.