మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

SRD: జిల్లాలో 8 మండలాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాను రేపటి నుంచి అంతరాయం ఏర్పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. సింగూర్ ఆనకట్ట వద్ద ఉన్న 100 MLD భూసారెడ్డిపల్లి నీటి శుద్ధి కార్మాగారం మరమ్మత్తుల కారణంగా సదాశివపేట, కొండాపూర్, కంది, పటాన్‌చెరు, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, మునిపల్లి మండలాలలో నిలిపివేస్తున్నట్లు వివరించారు.