పేకాట శిబిరంపై పోలీసుల దాడి

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ELR: చానమిల్లిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్సై రమేశ్, తన సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. డ్రోన్ నిఘా ద్వారా ఈ శిబిరాన్ని గుర్తించినట్లు సీఐ రజిని కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 64,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పేకాట, కోడి పందాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు.