సాఫ్ట్వేర్ సాకుతో వేతనాల నిలుపుదల అన్యాయం
NLG: ఉపాధి హామీ కూలీలకు రెండు పూటల ఫోటో విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామితో కలిసి ఇవాళ పనులను పరిశీలించిన ఆయన, సాఫ్ట్‌వేర్ సాకుతో వేతనాలు నిలిపివేయడం అన్యాయమన్నారు. కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని, పనిముట్లు సరఫరా చేయాలని కోరారు.