భూకబ్జా కక్షతో వ్యక్తిపై హత్యాయత్నం
JN: పాలకుర్తి మండలం చెన్నూరులో దారుణం చోటు చేసుకుంది. భూకబ్జా విషయంలో కక్ష పెంచుకున్న దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. కుటుంబసభ్యులపై దాడి చేసే క్రమంలో దుండగులను అడ్డుకున్న రవి కుమారుపై హత్యాయత్నం జరిగింది. గమనించిన స్థానికులు అక్కడికి రావడంతో కారు వదిలి నిందితులు పారిపోయారు. నిందితులను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు పేర్కొన్నారు.