ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి: సర్పంచ్

ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి: సర్పంచ్

NRPT: ఊట్కూర్ మండలం పెద్దజట్రంలో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సోమవారం 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రత గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రాణ రక్షణ కోసం వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బబిత, పోలీస్ ఆఫీసర్ లోకనాథ్, తదితరులు పాల్గొన్నారు.