వైన్ షాప్‌ను తొలగించాలని ఆందోళన
KMM: ఖమ్మం ముస్తాఫానగర్‌లో ఉన్న వైన్ షాప్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు షాప్ ఎదుట బైఠాయించి వ్యతిరేక నినాదాలు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై షాప్ ఉండడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని, మహిళలకు ఇబ్బందిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా ఉన్నారు.