VIDEO: రహదారి అధ్వానం.. ప్రయాణం నరకం

NZB: బోధన్ మండలం థర్డ్ బిలోలి నుండి సాటాపూర్ మీదుగా బోధన్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారితో పాటు గ్రామీణ రహదారులు కూడా చెడిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలంటే ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.