'అధికారులు ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి'
KNR ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈనెల 27 నుంచి వచ్చే నెల రెండు వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.