శుభలగ్నం సీన్.. భర్తను అమ్మిన భార్య

శుభలగ్నం సీన్.. భర్తను అమ్మిన భార్య

శుభలగ్నం సినిమాలాగానే ఓ భార్య తన భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. భోపాల్‌కు చెందిన రాజేష్‌కు భార్య, కూతురు ఉన్నారు. అయితే అతను మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడంతో వారిద్దరి మధ్య గొడవ జరుగుతుండేది. వీటి వల్ల వారి కూతురు మానసికంగా కృంగిపోవడంతో భార్య.. ప్రియురాలితో కోటిన్నరకు డీల్ కుదుర్చుకుంది. నగదు జమ అయిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చింది.