టోల్ ప్లాజా కార్మికుల నిరసన

ADB: కేంద్రం వెంటనే నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ప్లాజా కార్మికులు ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మంగళవారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా యూనియన్ అధ్యక్షులు అక్నూర్ సంతోష్, తదితరులున్నారు.